మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం.. ఎన్సీపీ మద్దతు లేదన్న శరద్ పవార్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.
మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు.
End of Twitter post by @PawarSpeaks
ఎన్సీపీ మద్దతు లేదు - శరద్ పవార్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.
''మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న అజిత్ పవార్ నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిర్ణయం కాదు. ఆయన నిర్ణయాన్ని మేం ఆమోదించట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు'' అని శరద్ పవార్ ట్వీట్ చేశారు.
''పార్టీలోను, కుటుంబంలోనూ చీలిక'' అంటూ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వాట్సప్ స్టేటస్ పెట్టారని, దీనిపై ఆమె కార్యాలయం కూడా ప్రకటన చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది